ఎస్ఐఆర్, బీఆర్ఎస్ సభ్యత్వంపై 23న అవగాహన సదస్సు

ఎస్ఐఆర్, బీఆర్ఎస్ సభ్యత్వంపై 23న అవగాహన సదస్సు

అచ్చంపేట, ఆంధ్రప్రభ: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్) మరియు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియలపై ఈ నెల 23న అచ్చంపేటలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే ఎస్ఐఆర్ కార్యక్రమంలో బీఎల్ఎ ల బాధ్యతలు, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులపై కార్యకర్తలకు పూర్తి అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే త్వరలో డిజిటల్ విధానంలో ప్రారంభం కానున్న బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కూ

డా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్లు వెల్లడించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోకల మనోహర్, మాజీ మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, నాయకులు మాకం తిరుపతయ్య, అమీనుద్దీన్, కరుణాకర్ రావు, పార్టీ ముఖ్య నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.