కష్టంలో చేయూతగా సీఎంఆర్ఎఫ్

  • టీడీపీ సీనియర్ నేత జంపాల

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: కష్టంలో సీఎం రిలీఫ్ ఫండ్ చేయూతగా నిలుస్తుందని టీడీపీ సీనియర్ నేత జంపాల సీతారామయ్య అన్నారు. ఇబ్రహీంపట్నానికి చెందిన పి.కృష్ణారావు, బి.హాసిని అనారోగ్యంతో చికిత్స కోసం కష్టాలు పడి, ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని టీడీపీ నేత జంపాలను కోరారు. ఆయన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లి సీఎం సహాయ నిధికి సిఫార్సు చేశారు. బాధితుల్లో ఒకరికి రూ.69,277, మరొకరికి రూ.1,53,013 సీఎంఆర్ఎఫ్ మంజూరయ్యాయి.

గురువారం తన కార్యాలయంలో బాధితులకు జంపాల చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టమంటే వెంటనే స్పందించే మనసున్న వ్యక్తి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు. ఆయన సహృదయంతో మైలవరం నియోజకవర్గంలో అత్యధికంగా రూ.20 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు చేయించారని చెప్పారు. ఇలాంటి మనసున్న నాయకుడు ఎమ్మెల్యే కావడం మైలవరం ప్రజల అదృష్టమన్నారు. బాధితులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, టీడీపీ నేత జంపాల సీతారామయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.