8:00pm 17జూన్2026 ముఖ్యాంశాలు
8:00pm 17జూన్2026 ముఖ్యాంశాలు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో ఓ విద్యార్థిని కళాశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఆమెను మొదట సమీప ఆస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, ఘటనపై పోలీసులు, కళాశాల యాజమాన్యం విచారణ చేపట్టాయి.
————————————–
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరప్రాంత పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు 12 జిల్లాల్లో ఎంపీటీసీ గుర్తించిన ప్రాంతాల్లో గోవా తరహా బీచ్ షాక్స్ ఏర్పాటు చేయనుంది. ఏడాది పాటు పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి, పర్యాటకుల స్పందన ఆధారంగా విస్తరణపై నిర్ణయం తీసుకోనుంది.
————————————–
ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ సంగారెడ్డిలో కొత్త శాఖను ప్రారంభించి తెలంగాణలో తన బ్రాంచ్‌ల సంఖ్యను 10కు పెంచుకుంది. జూన్ 30 వరకు జీరో లాగిన్ ఫీజు, రూ.50 లక్షల వరకు స్పాట్ లోన్ మంజూరు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.
————————————–
పెరుగుతున్న సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 వ్యవస్థను ఆధునీకరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఏఐ ఆధారిత వ్యవస్థలు, బహుభాషా మద్దతుతో ఫిర్యాదుల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేయనున్నారు.
————————————–
వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల పెరుగుదలతో ఏర్పడే ఎల్‌నినో ప్రభావం వల్ల భారతదేశంలో రుతుపవనాల బలం తగ్గి వర్షపాతం అసమానంగా నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
————————————–
చెన్నైలో ఖాళీ మద్యం బాటిళ్లను వెండింగ్ మెషీన్లో డిపాజిట్ చేసి రూ.10 డిపాజిట్ మొత్తాన్ని తిరిగి పొందే కొత్త విధానం ప్రారంభమైంది. టాస్మాక్ కేంద్రాల్లో కొనుగోలు చేసిన బాటిళ్లను రీసైక్లింగ్‌కు ప్రోత్సహించేందుకు ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు.
————————————–
పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గడం, క్రూడాయిల్ ధరలు పడిపోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 347 పాయింట్లు పెరిగి 77,155 వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు లాభపడి 24,085 వద్ద స్థిరపడింది.
————————————–
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో ఓ విద్యార్థిని కళాశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఆమెను మొదట సమీప ఆస్పత్రికి, అనంతరం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, ఘటనపై పోలీసులు, కళాశాల యాజమాన్యం విచారణ చేపట్టాయి.
————————————–
గత ప్రభుత్వం రుషికొండలో నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను ఏపీ కేబినెట్ సబ్ కమిటీ గురువారం పరిశీలించింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ పాల్గొనగా, నిర్మాణాలు మరియు సదుపాయాలపై అధికారులు వివరాలు అందించారు.
————————————–
పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గడం, క్రూడాయిల్ ధరలు పడిపోవడం, రూపాయి బలపడటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 347 పాయింట్లు పెరిగి 77,155 వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు లాభపడి 24,085 వద్ద ముగియగా ట్రెంట్, భారత్ డైనమిక్స్, యెస్ బ్యాంక్ షేర్లు రాణించాయి.
————————————–
హనుమకొండకు చెందిన ఓ మహిళ గర్భాశయ శస్త్రచికిత్స సమయంలో భయాందోళనకు గురికావడంతో వైద్యులు ఆమెకు ఇష్టమైన హీరో వెంకటేష్ నటించిన ‘సూర్యవంశం’ సినిమాను చూపించారు. సినిమా చూస్తూ ప్రశాంతంగా ఉన్న ఆమెకు వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేయగా, ఈ వినూత్న విధానం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంది.
పై ముఖ్యాంశాల్లోని పూర్తి వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
CLICK HERE TO READ MORE : Kalki2AliaBhatt | షూటింగ్‌పై క్రేజీ అప్డేట్! సోషల్ మీడియాలో వైరల్..
