పేద విద్యార్థుల చదువుకు చేయూత

  • ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి సాయం
  • రూ.10 వేల అందజేత
  • చదువుకునే విద్యార్థులకు అండగా నిలబడాలి : యలమంచిలి జయప్రకాశ్

విజయవాడ, ఆంధ్రప్రభ: ఆర్థిక ఇబ్బందులతో పిల్లల చదువులు కొనసాగించలేని పరిస్థితిలో ఉన్న ఓ నిరుపేద కుటుంబానికి వైఎన్‌ఆర్ చారిటీస్ చేయూతనందించింది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని గుణదల ప్రాంతానికి చెందిన షేక్ నాగులమీరాబీ భర్త షేక్ సుభాని మృతి చెందడంతో ముగ్గురు పిల్లల విద్యాభ్యాసాన్ని కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ విషయం తెలుసుకున్న వైఎన్‌ఆర్ చారిటీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాశ్ వెంటనే స్పందించి, పిల్లల విద్యాభ్యాసం కోసం రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని గురువారం వైఎన్‌ఆర్ చారిటీస్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆర్థిక ఇబ్బందులు ప్రతిభావంతులైన విద్యార్థుల చదువులకు అడ్డంకి కాకూడదని, అవసరమైన వారికి సంస్థ తరఫున సహాయం కొనసాగిస్తామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, నూతక్కి రాంప్రసాద్, ఏలూరు శివాజీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.