కనకదుర్గమ్మ సేవలో కాశి అన్నపూర్ణ ఆశ్రమ పీఠాధిపతి

కనకదుర్గమ్మ సేవలో కాశి అన్నపూర్ణ ఆశ్రమ పీఠాధిపతి

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మహంతి మనగిరి గురూజీ
ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దుర్గ గుడి చైర్మన్ బొర్రా గాంధీ..

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువైయున్న శ్రీ కనకదుర్గమ్మ వారిని కాశి అన్నపూర్ణ ఆశ్రమ పీఠాధిపతి మహంతి మనగిరి గురూజీ బుధవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న గురూజీకి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా గాంధీ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక ఏర్పాట్లతో అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు.

ఈ సందర్భంగా చైర్మన్ బొర్రా గాంధీ గురూజీకి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. తరువాత గురూజీ కొద్దిసేపు చైర్మన్ ఛాంబర్‌లో బొర్రా గాంధీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆలయ అభివృద్ధి పనులు, భక్తుల సౌకర్యాల విస్తరణ, నిర్వహణ అంశాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ అధికారులు భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను గురూజీకి చైర్మన్ బొర్రా గాంధీ వివరించారు.