జింకల దాడినుండి పంటలు కాపాడండి..

జింకల దాడినుండి పంటలు కాపాడండి..
ఊట్కూర్ తాసిల్దార్ ను వేడుకున్నబికే ఎస్ నాయకులు రైతులు.
ఊట్కూర్, ఆంధ్రప్రభ : జింకల బారి నుండి రైతులు సాగుచేసిన వివిధ పంటలను కాపాడాలని బి కే ఎస్ ఊట్కూర్ మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ తాసిల్దార్ చింతా రవికి బి కే ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి తమ పంటలు జింకల నుండి కాపాడాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం ఎంతో కష్టపడి సాగు చేస్తున్న పంటలు , జింకలు , గుంపులు గుంపులుగా వచ్చి నష్టం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ కానీ రైతులకు వెంటనే రుణమాఫీ చేసి ఆదుకోవాలనిఅన్నారు.
ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దజట్రం, అవసలోనిపల్లి, బిజ్వార్, పులిమామిడి, కొత్తపల్లి, నిడుగుర్తి, మొగ్దుమ్ పూర్ తదితర గ్రామాల రైతులు సాగుచేసిన పంటలు , జింకలు , తీవ్రంగా నష్టం చేస్తున్నాయనిఅన్నారు. జింకల దాడిలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని లేనిపక్షంలో తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు సాయిపన్ రాజు, కాశీమయ్య, అరవింద్, పెద్దజట్రం గ్రామ అధ్యక్షులు ఆంజనేయులు సుదర్శన్, పులిమామిడి రైతులు సుదర్శన్ రెడ్డి ఉప్పు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
