Sensex | లాభాల స్వీకరణపై దృష్టి
Sensex | లాభాల స్వీకరణపై దృష్టి
సెన్సెక్స్ స్వల్ప నష్టాల్లో.. నిఫ్టీ లాభాల అంచున
ఇరాన్-అమెరికా ఒప్పందం, రూపాయి బలహీనతతో అప్రమత్తమైన ఇన్వెస్టర్లు
Sensex | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌ను మిశ్రమ ధోరణిలో ప్రారంభించాయి. అంతర్జాతీయ పరిణామాలు, వరుస లాభాల తర్వాత లాభాల స్వీకరణ అవకాశాల నేపథ్యంలో మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఉదయం ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 14 పాయింట్లు నష్టపోయి ట్రేడవుతుండగా, నిఫ్టీ 2 పాయింట్ల స్వల్ప లాభంతో కొనసాగుతోంది. ప్రారంభం నుంచే సూచీలు ఊగిసలాట ధోరణిని ప్రదర్శిస్తున్నాయి.
ఇరాన్-అమెరికా మధ్య ఒప్పందంపై సంతకాలు జరగడం, హర్మూజ్ జలసంధి మళ్లీ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుందనే వార్తలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. అయితే గత రెండు రోజులుగా మార్కెట్లు గణనీయంగా లాభపడటంతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
