Rangareddy | వాట‌ర్ ట్యాంకర్ ను ఢీకొన్న కారు – ముగ్గురు దుర్మ‌ర‌ణం

హైద‌రాబాద్ – రంగారెడ్డి జిల్లాలో వాట‌ర్ ట్యాంక‌ర్ ను ఢీకొన్ని ప్ర‌మాదంలో ముగ్గురు దుర్మ‌రం చెందారు.. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఎగ్జిట్ 13 వద్ద రాములు వాటర్ ట్యాంకర్ తో చెట్లకు నీళ్లు పడుతున్నాడు. వెనుకనుంచి వేగంగా వచ్చిన బ్రీజా కారు రాములుతో పాటు ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అత‌డు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు కూడా మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు నడిపిన వ్యక్తి శేరిలింగంపల్లి చెందిన కృష్ణ రెడ్డిగా గుర్తించారు. పెద్ద అంబర్పేట్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న కారు రావిర్యాల టోల్గేట్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి ట్యాంకర్ ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తేల్చారు.. కేసు నమోదు చేసుకున్న ఆదిభట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *