మక్కాన్ శాంతిని కోరుకునే వ్యక్తి

మక్కాన్ శాంతిని కోరుకునే వ్యక్తి
- కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకే అలా మాట్లాడారు
- మంత్రి శ్రీధర్ బాబు
మంథని, ఆంధ్రప్రభ : రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ శాంతిని కోరుకునే వ్యక్తి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలియజేశారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా మంథనిలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తలను పలువురు ఇబ్బందులు పెడుతున్నారని ఆ విషయాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులుగా మక్కాన్ సింగ్ దృష్టికి తీసుకువెళ్లగా వారిలో ధైర్యం నింపేందుకే ఎవరైనా అడ్డం పడితే ఊరుకోమని మాట్లాడారన్నారు. కార్యకర్తలకు ధైర్యం చెప్పే క్రమంలోనే ఆయన అలా మాట్లాడారు తప్ప ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు.
