Amaravati-Oncology-Center : అమరావతిలో ఆంకాలజీ విప్లవం

Amaravati-Oncology-Center : అమరావతిలో ఆంకాలజీ విప్లవం

  • ఆస్ట్రాజెనెకాతో ఏపీ ప్రభుత్వ కీలక ఒప్పందం
  • ఐజీఎస్ సీ ఏర్పాటున‌కు బయోటెక్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా సిద్ధం
  • ఏపీ సీఎం సీబీఎన్ స‌మ‌క్షంలో కుదిరిన ఒప్పందం

(ఆంధ్ర‌ప్ర‌భ‌, అమ‌రావ‌తి )

Amaravati-Oncology-Venter : అంతర్జాతీయ ఫార్మాసుటికల్, బయోటెక్ దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్, క్యూర్ ఏఐ సంస్థలు ఏపీ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం చేసుకున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్స్ సెంటర్ ఏర్పాటున‌కు అస్ట్రాజెనెకా ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది.
అమరావతిలో దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ విధానం ప్రారంభించేందుకు వీలుగా కీలక అవగాహనా ఒప్పందం ఇది.

ఊపిరితిత్తులు, రొమ్ము కాన్సర్ రోగుల కోసం అధునాతన జన్యు పరీక్షలు బయోమార్కర్ టెస్టింగ్ చేసేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్ సెంటర్ ను ఆస్ట్రాజెనెకా ఏర్పాటు చేస్తోంది. ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సదుపాయాలను తీసుకురావటమే ఒప్పందం లక్ష్యమని సీఎం చంద్రబాబు స్స‌ష్టం చేశారు. ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో క్వాంటం పరిశోధనలు జరగాల్సి ఉందని ముఖ్యమంత్రి సూచించారు.