అసాంఘిక శక్తులను అరికట్టండి

అసాంఘిక శక్తులను అరికట్టండి
గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ సబ్ డివిజన్ లో అసాంఘిక శక్తులను అరికట్టి శాంతి భద్రతలను పరిరక్షించాలని గుడివాడ డీఎస్పీ పాల శ్రీనివాస్ సిబ్బందికి తెలిపారు. గుడివాడ డీఎస్పీగా పాల శ్రీనివాస్ పదవీ బాధ్య తలు స్వీకరించారు. సిబ్బందితో ఆయన మాట్లాడుతూ పోలీసు స్టేషన్ కు వచ్చే ప్రజలకు అండగా ఉండి సమస్యల పరిష్కారంలో తగిన శ్రద్ధ వహించాలన్నారు.
ఫిర్యాదుల పరిష్కారంలో సిబ్బంది చిత్తశుద్ధితో నడుచుకోవాలన్నారు. నేరాలు అదుపు చేయడానికి తగిన చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పలు ప్రజాసంఘాల నాయకులు, అధికార ప్రముఖులు డీఎస్పీని కలిసి సత్కరించారు.
