రైతులు కంది పంట సాగు చేసుకోండి..
రాప్తాడు, ఆంధ్రప్రభ : రాప్తాడు మండల పరిధిలోని ప్రసన్నాయనపల్లి, గొందిరెడ్డిపల్లి గ్రామాల్లో కంది వేరుశనగ ఇతర పంట పొలాలను మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో రేకులకుంట ప్రధాన శాస్త్రవేత్త మల్లేశ్వరి హైదరాబాదు నామ్ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్తలు నిర్మల శ్రీకాంత్ మురళీకృష్ణ విద్యావతి పరిశీలించారు.ఈ సంధర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ పిఆర్జీ-176(ఉజ్వల) ఎల్ఆర్జీ-105(కృష్ణ) కంది రకాలు ఎండు తెగులు మరియు గొడ్డు తెగులును తట్టుకుంటాయని తెలిపారు.
అందువలన రైతులు ఈ రకాలను సాగు చేసుకోవాలని సూచించారు. కంది విత్తే ముందుగా టి.విరిడి మరియు మ్యాన్కోజెబ్ -3/కేజీ విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలని తెలియజేశారు.కంది పంట లో నల్లి నివారణకు వెట్టాబ్లి సల్ఫర్-3 గ్రాములు/లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలని అన్నారు. అనంతరం గొందిరెడ్డిపల్లి గ్రామానికి కేవీకే రెడ్డిపల్లి శాస్త్రవేత్త మాధవి వర్షాదారిత వేరుశనగ పంట ను సందర్శించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎస్.కృష్ణ చైతన్య జి.కొత్తపల్లి రామానాయుడు ఏఈఓ లు సుజిత రంజిత ఆర్ ఎస్.కె ఉద్యోగులు సోనియా రాజు రైతులు పాల్గొన్నారు.
