Peddapalli | ఘనంగా మహాశివరాత్రి వేడుకలు..

Peddapalli | ఘనంగా మహాశివరాత్రి వేడుకలు..

Peddapalli, ఆంధ్రప్రభ : మహాశివరాత్రి పర్వదిన వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున నుండి పట్టణంలోని శివాలయంలో మహాశివుడికి అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు వేద మంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా నిర్వహించారు. మహాశివుడి దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుండి బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఇల్లందుల కృష్ణమూర్తి తెలియజేశారు.

Leave a Reply