దోపిడీని అరికట్టాలని జేసికి వినతి..
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నంలో సిగరెట్ వ్యాపారుల దోపిడీకి అడ్డుకట్ట వేసినందుకు కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ ను మంగళవారం ఆయన చాంబర్లో బీ.సీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా నాయకులు కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు తెలియజేసి పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బీ.సీ సంఘ నాయకులు శేకు బోయిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత ఆరు నెలల నుంచి సిగరెట్ వ్యాపారులు వివిధ దశల్లో ధూమపాన ప్రియులను దోచుకోవడం జరిగిందన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించగా ఆయన తక్షణమే స్పందించి త్వరితగతిన సమస్యను పరిష్కరించి సిగరెట్ వ్యాపారుల దోపిడీని అరికట్టినందుకు జె.సి నవీన్ కు కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు తెలియజేసి పుష్ప గుచ్చం తో సత్కరించినట్లుగా సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో భోగిరెడ్డి సుభాని, బి. ప్రసాద్, బి.నాగరాజు, సి.నాంచారయ్య తదితర బీ.సీ నాయకులు పాల్గొన్నారు.
