School | రోడ్డెక్కిన విద్యార్థులు…!

School | రోడ్డెక్కిన విద్యార్థులు…!

School | ఇచ్చోడ, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపులే వెనుకబడిన తరగతుల పాఠశాల, కళాశాల(School, College) నర్సాపూర్ విద్యార్థులు ఈ రోజు ప్రిన్సిపాల్ వైఖరికి నిరసనగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను గత కొన్ని రోజులుగా పాఠశాల ప్రిన్సిపల్ బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తూ వారిని మానసికంగా వేధిస్తూ ఉండడంతో భయభ్రాంతులకు గురై విధి లేని పరిస్థితుల్లో ఈ రోజు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బైఠాయించారు.

అనంతరం పోలీస్ స్టేషన్(Police station) వెళ్లి ప్రిన్సిపాల్ వేధింపులు భయభ్రాంతులకు గురి చేస్తున్న వైనాన్ని ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా పాఠశాల ప్రిన్సిపాల్ బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తూ మానసికంగా వేధిస్తున్నారని తమ చదువులకు కూడా ఆటంకం ఏర్పడుతుందని వారు వాపోయారు. పాఠశాలలోని కొందరు విద్యార్థులను టార్గెట్‌(target)గా చేసుకొని ఎదురు తిరిగితే చంపుతానని బెదిరించారని, ఈ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వారు కోరారు. పాఠశాలలో జరుగుతున్న విషయాలను తమ తల్లిదండ్రులకు కూడా తెలియనియకుండా తమను మానసికంగా బెదిరింపులకు కురిచేస్తున్నాడని అన్నారూ. ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వారు కోరారు.