Vikarabad | పదోన్నతుల పరీక్షలను పరిశీలించిన ఎస్పీ
Vikarabad | పదోన్నతుల పరీక్షలను పరిశీలించిన ఎస్పీ
Vikarabad | వికారాబాద్, ఆంధ్రప్రభ : మల్టీ జోన్-II పరిధిలో ARSIల నుంచి ASIలుగా పదోన్నతి కల్పించే డిపార్ట్‌మెంటల్ క్వాలిఫైయింగ్ పరీక్షల శారీరక సామర్థ్య పరీక్షను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా (SP Sneha Mehra) గురువారం ఉదయం పర్యవేక్షించారు.
పరీక్ష నిర్వహణ తీరు, అభ్యర్థుల ప్రదర్శనను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా స్నేహ మెహ్రా (Sneha Mehra) మాట్లాడుతూ… “పరీక్షల్లో క్రమశిక్షణ, పారదర్శకత చాలా ముఖ్యం. యోగా, వ్యాయామం అలవాటు చేసుకొని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. ఈ టెస్ట్ కేవలం పదోన్నతి కోసం మాత్రమే కాదు, సామర్థ్యం పెంచుకునే అవకాశం. పదోన్నతి పొందిన తర్వాత మరింత బాధ్యతాయుతంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి” అని సూచించారు.
యాద్రి జోన్ (Yadri Zone) నుంచి 10 మంది, చార్మినార్ జోన్ నుంచి 16 మంది, జోగుళాంబ జోన్ నుంచి 2 మంది, మిగతా 5 మందితో కలిపి మొత్తం 33 మంది ఈ పరీక్షలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.రాములు నాయక్, డీఎస్పీ వీరేష్, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
