ఎస్సీ కార్పొరేషన్ రుణాల గడువు పెంచాలి..

ఎస్సీ కార్పొరేషన్ రుణాల గడువు పెంచాలి..

చిట్యాల, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కులస్తులకు జీవనోపాధి వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను గడువు 15 రోజులు పెంచాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు నేరెళ్ల ఓదెలు మాదిగ, చిట్యాల మండలం అధ్యక్షులు దొడ్డ శంకర్ మాదిగలు కోరారు. ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు కులం, నివాసం, ఆదాయం, అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు గడువును పెంచాలని కోరారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం, ఎస్సీ కార్పొరేషన్ యూనిట్లు పెంచి 15 రోజులు గడువును పెంచాలని ఓదెలు, శంకర్ కోరారు. ఈ కార్యక్రమంలో దొడ్డే భద్రయ్య, రామకృష్ణ, రాజు, అనిల్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply