ఇస్రో ప్రోగ్రాం కోచింగ్ కి ఎంపికైన గొంది శంకర్..
ఇస్రో ప్రోగ్రాం కోచింగ్ కి ఎంపికైన గొంది శంకర్..
దమ్మపేట, ఆంధ్రప్రభ : ఇస్రో ఎస్టిఈఎం ప్రోగ్రాంలో భాగంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో జరుగుతున్న కోచింగ్ కు స్థానిక సీనియర్ న్యాయవాది గొంది మురళీమోహన్ కనిష్ట కుమారుడు గొంది శంకర్ శ్రీ నరసింహ ఎంపికయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్న ఇస్రో సంస్థలో జరుగుతున్న ప్రోగ్రాంలో కోచింగ్ కు ఎంపిక కాబడిన గొంది శంకర్ కు స్థానిక న్యాయవాదులతో పాటుగా పట్టణంలోని పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా అభినందనలు తెలిపారు. ఇస్రో ప్రోగ్రాం కోచింగ్ కి ఎంపికైన గొంది శంకర్ గంగారంలోని సాయి స్ఫూర్తి డిఏవి స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు.
