తహసిల్దార్ ను సన్మానించిన సర్పంచులు, నాయకులు

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని భీమ్‌గల్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసిల్దార్ కు మండల ఫోరం సభ్యులు, అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బీ. స్వామి పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు పిప్రి (జె) సర్పంచ్ అరిగెల జనార్ధన్, ఉపాధ్యక్షుడు పెద్దమ్మ కాడి తాండ సర్పంచ్ భుక్య రమేష్ నాయక్, చేంగల్ సర్పంచ్ దుమాల మమత (రాజు),బాబాపూర్ సర్పంచ్ ఎం ఏ.సమీర్, బాబానగర్ సర్పంచ్ శ్రీరామ్ సుమలత (అరవింద్), పురాణిపేట్ సర్పంచ్ బుర్ర సుమ (దేవేందర్ గౌడ్,) బాచన్ పల్లి సర్పంచ్ వెన్నెల బాలమణి (జనార్ధన్,) లో నూతనంగా వచ్చి తహసిల్దార్ ను మర్యాదపూర్వ కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధికి పరస్పర సహకారంతో పనిచేయాలని నాయకులు సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తహసిల్దార్ ఎం.కిరణ్ కుమార్ హామీ ఇచ్చారు.