1994 batch | ఈనెల 30న శివధర్‌రెడ్డి రిటైర్…

1994 batch | ఈనెల 30న శివధర్‌రెడ్డి రిటైర్

1994 batch | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ (డీజీపీ)గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి ఈ నెల 30న ఉద్యోగ విరమణ పొందనున్న నేపథ్యంలో ఈ నియామకం చేపట్టింది.

ఇటీవల యూపీఎస్సీ డీజీపీ పోస్టుకు అర్హులైన ఐపీఎస్ అధికారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో సీవీ ఆనంద్‌తో పాటు 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా పేర్లు ఉన్నాయి.

ఈ ముగ్గురిలో అత్యంత సీనియర్‌ అధికారి కావడంతో సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం డీజీపీగా ఎంపిక చేసింది. పోలీసు శాఖలో విస్తృత అనుభవం కలిగిన ఆయనకు వివిధ కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉంది.

సీవీ ఆనంద్ నియామకంతో రాష్ట్ర పోలీసు వ్యవస్థలో కొత్త దిశగా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ నియామకం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Leave a Reply