రైతులు పండించిన పంట కొనుగోలు చేసే బాధ్యత మాదే

రైతులు పండించిన పంట కొనుగోలు చేసే బాధ్యత మాదే

చివరి గింజ వరకు కొంటాం
ప్రతిపక్షం ఉచ్చులో రైతులు పడొద్దు

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తుందని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్ స్పష్టత ఇచ్చారు. మంగళవారం భీంగల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఉచ్చులో రైతులు పడొద్దని కోరారు. కాంగ్రెస్ ప్రజా పాలన రైతు సంక్షేమం కొరకు పని చేస్తుందని పేర్కొన్నారు. స్టేట్ వైడ్ గా 11 మెట్రిక్ టన్స్ వడ్లు కొనుగోలు చేయడం జరిగిందని అందులో నిజామాబాదు జిల్లా నుండి నాలుగున్నర మెట్రిక్ టన్స్ వడ్లు సేకరించామని ముత్యాల పేర్కొన్నారు.

ఇది నిజామాబాదు జిల్లా రైతుల మీద రేవంత్ రెడ్డి కి ఉన్న ప్రేమకు నిదర్శనం అన్నారు. రైతులు కస్టపడి పండించిన ధాన్యం సేకరించడమే లక్ష్యంగా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా పని చేస్తోందని తెలిపారు. జిల్లా లో ఎండల తీవ్రత పెరగడం వలన దొడ్డు వడ్ల తేమ తగ్గి తరుగు ఎక్కువగా వస్తోందని ఆ కారణంగా మిల్లర్లు ధాన్యం దింపుకునేందుకు ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. అయినప్పటికీ రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మిలర్ల ను నయానో, బయనో ఒప్పించి ధాన్యం తీసుకునేలా ప్రభుత్వం ఒప్పిస్తుందని అన్నారు.

కొనుగోలు చేసిన ధాన్యానికి రెండు నుండి నాలుగు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్న సంగతి గుర్తు చేశారు రైతులు అనవసరంగా ఆందోళన చెందవద్దని కోరారు. ఇబ్బంది సమయంలో ప్రభుత్వానికి రైతులు సహకరించాలని వేడుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర ఏండ్లలో ఇది ఐదో పంట కొనడం అన్నారు. ఏనాడూ రైతుల ధాన్యం లో కడ్త తీయలేదని, కడ్త నష్టం కూడ ప్రభుత్వమే భరించిందని చెప్పారు. ఎండ తీవ్రత కారణంగా వస్తున్న ఇబ్బంది ని రైతులు కూడ గుర్తించి సహకరించాలన్నారు.

13 కొనుగోలు కేంద్రాలలో మక్కలు కొన్నాం

బాల్కొండ నియోజకవర్గం లో మక్కల కొనుగోలు కొరకు 13 కేంద్రాలను ఏర్పాటు చేసి మక్కలు సేకరించడం జరిగిందని అందుకొరకు మార్కెట్ కమిటీ చైర్మెన్లు, సహకార సంఘాల చైర్మెన్లు కష్టపడ్డారని ముత్యాల పేర్కొన్నారు. ప్రభుత్వం చిత్త శుద్ధితో రైతుల సంక్షేమం కొరకు పాటుపడుతుంటే బీఆర్ఎస్ నాయకులు అల్టీమేటం పేరిట రైతులను రెచ్చగొట్టడం సమంజసం కాదన్నారు.

కేంద్రం సహకరించడం లేదు

రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి కేంద్రం చేతులు దులుపుకుంటుందని ముత్యాల విమర్శించారు. ధాన్యం సేకరణ లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం సహకరించడం లేదని విమర్శించారు. ధాన్యం సేకరణ విషయం లో కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు లేఖ రాసినా ప్రయోజనం లేదన్నారు.

ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ పాలెపు నర్సయ్య , మాజీ ఏఎంసీ చైర్మన్ సుంకెట రవి పార్టీ పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పర్స అనంతరావు, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, మాజీ సర్వసమాజ్ కమిటీ అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకుడు నాగేంద్రబాబు, కౌన్సిలర్లు సంగ్యానాయక్, సందీప్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అరిగెల జనార్దన్ మరియు నాయకులు నల్లూరి శ్రీనివాస్, వాక మహేష్, రావూట్ల నవీన్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply