17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

అమరావతి, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం సమావేశాలు ఆగస్టు 17 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు సమావేశాల నిర్వహణకు సంబంధించి నేడు జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వ శాఖల పనితీరు, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు పలు కీలక అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. సమావేశాల పూర్తి షెడ్యూల్‌ను ప్రభుత్వం త్వరలో అధికారికంగా ప్రకటించనుంది.