రోడ్డెక్కిన రైతన్న

రోడ్డెక్కిన రైతన్న
ధాన్యం కొనుగోలు జాప్యంపై కన్నెర్ర
హైవేపై రాస్తారోకో చేపట్టిన ఎదుల్లగూడెం రైతులు
వలిగొండ మే 27 (ఆంధ్రప్రభ) : కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయడం లేదని కేంద్రాలకు లారీలు రావడంలేదని ఆగ్రహించిన రైతులు రాస్తారోకో చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఏదుళ్ళగూడెం స్టేజి వద్ద చిట్యాల – భువనగిరి ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం ఏడు గంటలకు రైతులు రాస్తారోకో చేపట్టారు. వలిగొండ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఏదుళ్ళగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో 45 రోజులుగా కొనుగోలు కొన సాగుతున్న ఇప్పటివరకు 30 వేల బ్యాగులు మాత్రమే కొనుగోలు జరిగాయని, ఇంకా 70 వేలకు పైగా బస్తాలు కేంద్రంలోనే ఉన్నట్లు రైతులు రైతులు ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు.
వర్షాలు తరుముకొస్తున్నా కొనుగోల్లు పట్ల అధికారులు శ్రద్ధ చూపడం లేదని అగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు కోసం రైతులు రాస్తారోకో చేస్తున్న విషయం తెలుసుకున్న తహసిల్దార్ దశరథ ఎస్సై యుగంధర్ తో కలిసి వచ్చి దాన్యం కొనుగోలు మరింత వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు . ఈ సందర్భంగా రైతులు తాసిల్దార్ను నిలదీశారు. 45 రోజులు అయినా ఇప్పటివరకు 30% కొనుగోలు చేశారని రైతులు చెప్పడం జరిగింది. అధికారులు ఇచ్చిన హామీ మేరకు రైతులు రాస్తారోకో విరమించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొంతం శ్రీనివాస్ రైతులు కొలను వెంకటరెడ్డి కొండల్ రెడ్డి కేశవరెడ్డి బోడపట్ల నర్సిరెడ్డి గుణగంటి నరేష్ రవీందర్ రెడ్డి మునుకుంట్ల బాలు రైతులు పాల్గొన్నారు.
