AP | మోడల్ స్కూల్స్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్…

పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లు
ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం


AP |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోడల్ స్కూల్స్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వారి పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఈ నిర్ణయం రాష్ట్రంలోని అన్ని ఏపీ మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్తించనుంది.

దీనికి సంబంధించిన అమలు చర్యలు వెంటనే చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయంతో మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు మరో రెండేళ్ల పాటు సేవలు కొనసాగించే అవకాశం లభించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.