ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ చేసిన సర్పంచ్

కడెం, ఆంధ్రప్రభ ; కడెం మండలంలోని నర్సాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న ఉపాధి కూలీలకు నర్సాపూర్ గ్రామ సర్పంచ్ డి.ఎస్ సంగీత రాజేష్ లు మజ్జిగను అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఉపాధి కూలీలు ఎంతో కష్టపడి ఎండలో ఉపాధి పనులు చేస్తున్నారని వారి దహర్తిని తీర్చడానికి తాము వారికి మజ్జిగను అందజేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జంగం రమేష్ స్థానిక పంచాయతీ కార్యదర్శి నరేష్ జిపి వార్డు సభ్యులు ఈ జి ఎస్ టి ఏ జాడీ కాంతారావు ఫీల్డ్ అసిస్టెంట్ జెట్టి రాజు ఉపాధి కూలీలు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply