జనసైనికుల ఆత్మీయ సమావేశం

జనసైనికుల ఆత్మీయ సమావేశం

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం అన్నారపు రమణ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ, పిఓసి జెర్రీ పోతుల సనత్ కుమార్, జనసేన జిల్లా నాయకులు కంకనాల దేవేందర్, టేకుమట్ల మండల కోఆర్డినేటర్ జంగా మధుకర్ పాల్గొన్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. జనసేన పార్టీ సిద్ధాంతాలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పడినవని తెలిపారు. ప్రతి జనసైనికుడు పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడం అత్యవసరమని అన్నారు. ప్రజలకు ఎదురవుతున్న నిరుద్యోగం, రైతు సమస్యలు, ధరల పెరుగుదల వంటి అంశాల పై జనసేన పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని, ప్రజలతో నేరుగా కలిసిపోవాలని సూచించారు. ఈ సమావేశంలో జనసేన కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply