గాజు గ్లాసులో తేనీరు సేవించిన మంత్రి నాదెండ్ల

ఏలూరు జిల్లా కలెక్టరేట్‌లో ఆసక్తికర ఘటన..

ఏలూరు, ఆంధ్రప్రభ: ఏలూరు జిల్లా కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ హాలులో మంగళవారం నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

సమావేశంలో భాగంగా అధికారు, సిబ్బంది అందరికీ పింగాణీ కప్పులలో తేనీరు (‘టీ’) అందించగా, మంత్రి నాదెండ్ల మనోహర్ కోసం సిబ్బంది ప్రత్యేకంగా తమ పార్టీ ఎన్నికల గుర్తు అయిన ‘గాజు గ్లాస్’లో టీ అందించారు. ఆ గ్లాసులోని తేనీటిని మంత్రి ఎంతో ఉత్సాహంగా ఆస్వాదిస్తూ సేవించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన విశేషాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.