గోదావరిలో గల్లంతైన వృద్ధుడు మృతి..
గుర్తింపునకు పోలీసుల ప్రయత్నాలు
గోదావరి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందినట్లు అనుమానం
మహాదేవపూర్, ఆంధ్రప్రభ: కాళేశ్వరం గోదావరి నదిలో విషాద ఘటన చోటుచేసుకుంది. సుమారు 60 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని ఓ వ్యక్తి గోదావరి నదిలో స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందినట్లు కాళేశ్వరం ఎస్సై తమాషా రెడ్డి తెలిపారు.
మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, అతని గుర్తింపునకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తించినా లేదా అతని వివరాలు తెలిసిన వారు వెంటనే కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
సమాచారం ఉన్నవారు 8712658115, 8712658137 సెల్ నంబర్లకు సంప్రదించాలని సూచించారు.
