మహిళల ఆర్థిక స్వాలంభనకు స్వయం ఉపాధి కీలకం….

మహిళల ఆర్థిక స్వాలంభనకు స్వయం ఉపాధి కీలకం….
మహిళలను పారిశ్రామిక వేత్తలను చేయాలన్నదే లక్ష్యం.
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : మహిళల ఆర్థిక స్వాలంభన సుస్థిర భవిష్యత్తుకు స్వయం ఉపాధి మార్గాలు కీలక పాత్ర వహిస్తాయని ప్రతి మహిళలను పారిశ్రామిక వేత్తగా తిర్చిదిద్ది ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా అధికారులు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్‌ను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వాలంభనకు స్వయం ఉపాధి కీలకమవుతాయని జిల్లా గ్రామీణాభివృద్ధి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మహిళాలకు చేతి వృత్తి పై శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను కల్పించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రివర్యుల ఆలోచన విధానలకు అనుగుణంగా రూరల్ ఇన్నోవేషన్స్ ఇంక్యూబేషన్ స్కిల్లింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (రైజ్) కేంద్రాన్ని ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి అవకాశాలపై శిక్షణ అందించడం జరుగుతుందన్నారు.

స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త నినాదంతో అడుగులు వేసి వినూత్నంగా రైజ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ లక్ష్యంగా రూపొందించిన ఈ వినూత్న కార్యాచరణ ప్రణాళికకు నీతి ఆయోగ్ నుంచి గుర్తింపు లభించిందన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా రైజ్ కేంద్రంలో హెల్ప్ డెస్క్, ఐడియా డెస్క్, స్కిల్లింగ్ డెస్క్, ప్లేస్‌మెంట్ డెస్క్, బ్యాంకింగ్ డెస్క్ లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని వాటిని మహిళలు స్వదినియోగం చేసుకుని విజయం వైపు అడుగులు పడేలా అధికారులు కృషి చేయాలన్నారు. మహిళలు పొందుతున్న శిక్షణను కేవలం నేర్చుకోవడానికే పరిమితం కాకుండా, ఆచరణలోకి తీసుకువచ్చి ఆదాయ మార్గాలుగా మార్చుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.

స్వయం సహాయక సంఘాల ద్వారా బ్యాంకు రుణాలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలను వినియోగించుకుని పారిశ్రామిక, వ్యాపార యÖనిట్లు ప్రారంభించేందుకు కృషి చేయాలని చూచించారు. ఇగ్నైట్ సెల్‌లో మహిళా పారిశ్రామిక వేత్తలు వై. హరిత తయారు చేసిన హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్, హెయిర్ యాక్సెసరీస్, హన్సిత తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్లు, కప్ కేక్స్, కె. వెంకటేశ్వరమ్మ తయారు చేసిన పేపర్ బ్యాగ్స్, హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ, షీలా తయారు చేసిన అర్గానిక్ హెయిర్ ఆయిల్, సుధా పచ్చళ్ళు అంజలి బ్యాంగిల్స్ ప్రదర్శించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
