ఏపీ డిప్యూటీ సీఎం త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు..
దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం పూజలు నిర్వహించిన జనసేన నేతలు
కోడూరు, ఆంధ్రప్రభ : జనసేన పార్టీ అధినేత , ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ కోడూరు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉల్లిపాలెం గ్రామంలో గల అభినవ మేలుకోటుగా ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్రీమన్నారాయణ స్వామి దేవాలయం చుట్టూ పార్టీ నేతలు ప్రదక్షిణలు చేసి స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ చే పవన్ కళ్యాణ్ గోత్రనామాలపై అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు మరె గంగయ్య,పార్టీ జిల్లా కార్యదర్శి కొండవీటి సునీత, కోడూరు పట్టణ అధ్యక్షులు కోట రాంబాబు, కోడూరు పిఎసిఎస్ చైర్పర్సన్ పూత బోయిన కరుణ్ కుమార్, బచ్చు వెంకటేష్, కాగిత రామారావు, అప్పికట్ల వినోద్, సనక జగన్, గుడివాక జనార్ధన్, పరిసే వెంకటేశ్వరరావు, పూత బోయనవెంకటేశ్వరరావు, లంకేరవి,అడుసు మిల్లు రాము, పుషడుపు భానుమూర్తి, తదితరులు పాల్గొన్నారు


