హోటల్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు జేసికి వినతి..

హోటల్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు జేసికి వినతి..

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం పట్టణంలోని హోటళ్లు ఎదుర్కొంటున్న కమర్షియల్ ఎల్పిజీ గ్యాస్ కొరత సమస్యపై మచిలీపట్నం హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. జిల్లా కలెక్టర్ డి. కె.బాలాజీ, ఐఏఎస్ ఇతర అధికారిక కార్యక్రమాలలో బిజీగా ఉండటంతో, అసోసియేషన్ సభ్యులు తమ వినతిపత్రాన్ని జాయింట్ కలెక్టర్ నవీన్ కి అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ప్రస్తుతం ఉన్న కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత వల్ల హోటల్ వ్యాపారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని వివరించారు.

జాయింట్ కలెక్టర్ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హోటల్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వం ఈ సమస్యపై సానుకూల నిర్ణయం తీసుకొని హోటల్ వ్యాపారానికి అవసరమైన కమర్షియల్ ఎల్పీజీ సరఫరా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. హోటల్ పరిశ్రమ ద్వారా అనేక మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని, అలాగే ప్రజలకు ప్రతిరోజూ సేవలు అందిస్తున్నందున ఈ సమస్యకు త్వరగా పరిష్కారం లభించాలని అసోసియేషన్ కోరింది. మచిలీపట్నం హోటల్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.