Rs 7.50 Hike Petrol : ఈసారీ .. భారీ వడ్డన Andhra Prabha Top News

Rs 7.50 Hike Petrol : ఈసారీ .. భారీ వడ్డన Andhra Prabha Top News
- లీటరు పెట్రోలు.. ₹2.61
- లీటరు డీజెలు ₹2.71
- మొత్తం పెరుగుదల ₹7.50
( ఆంధ్రప్రభ, న్యూస్ నెట్ వర్క్ )
Rs 7.50 Hike Petrol : అమెరికా యుద్ధ కాంక్షతో… మళ్లీ ఇంధనం ధరలు భగ్గుమన్నాయి. ఇక భారత దేశంలో ఆయిల్ కంపెనీలు .. రోజు విడిచి రోజు పెట్రోలు , డీజెలు ధరలు పెంచుతున్నాయి. గత మూడు సార్లు లీటరు పెట్రోలు, డీజెలు ధర ఒక రూపాయిలోపు పెంచిన ఆయిల్ కంపెనీలు ఈ రోజు (మే 25, 2026, సోమవారం) దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్‌పై ₹2.61, లీటర్ డీజిల్‌పై ₹2.71 వంతున వడ్డించాయి. ఒకే భారీగా పెంచాయి. గత 10 రోజుల్లో ఇంధన ధరలు పెరగడం ఇది నాలుగోసారి. తెలంగాణలోని హైదరాబాద్ లొ లీటరుకు రూ. 112.81 (మే మొదటివారంలో రూ. 107.46 గా ఉన్న ధర, ప్రస్తుతం రూ. 5.35 పెరిగింది).డీజిల్ ధర: లీటరుకు రూ. 100.94 ఇటీవలి పెంపుతో డీజిల్ ధర మొదటిసారి రూ. 100 మార్కును దాటింది . ఇక ఆంధ్రప్రదేశ్ విజయవాడ పెట్రోల్ ధర: లీటరుకు రూ. 114.72 (మే ప్రారంభంలో రూ. 109.63 గా ఉన్న ధర, ప్రస్తుతం రూ. 5.09 పెరిగింది).డీజిల్ ధర: లీటరుకు సుమారు రూ. 100.56 వరకు ఉంది.
Rs 7.50 Hike Petrol : తెలుగు రాష్ట్రాల్లో వడ్డన ఇలా
- హైదరాబాద్: పెట్రోల్ ₹115.62 , డీజిల్ ₹103.76
విజయవాడ: పెట్రోల్ ₹117.16 , డీజిల్ ₹104.89
విశాఖపట్నం: పెట్రోల్ ₹116.39 , డీజిల్ ₹104.11
తిరుపతి: పెట్రోల్ ₹117.08 , డీజిల్ ₹104.75
ఈ నెల మే 15 నుంచి ఇప్పటివరకు జరిగిన నాలుగు పెంపులతో కలిపి, లీటర్ పెట్రోల్, డీజిల్‌లపై మొత్తంగా దాదాపు ₹7.50 వరకు భారం పెరిగింది. - తాజా గా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో నేటి రేట్లు ఈ విధంగా ఉన్నాయి
