తప్పిన అగ్ని ప్రమాదం

తప్పిన అగ్ని ప్రమాదం
హసన్ పర్తి, ఆంధ్రప్రభ : వ్యవసాయ పొలంలో మంటలు చెలరేగిన సమాచారంతో వెంటనే హసన్ పర్తి సిఐ ఎ మహేందర్ తమ సిబ్బందితో సంఘటన ప్రాంతాన్ని చేరుకొని మంటలను ఆర్పి వేసిన ఊదంతం ఇది. వివరాలలోకి వెళితే.. హన్మకొండ జిల్లా హసన్ పర్తి పరిధిలోని ఇండియన్, విహాన్ పాఠశాలల ముందు పరిసరాలో ఉన్న వ్యవసాయ పొలంలో వరి కొయ్యలు కాలిపోతుండడంతో మంటలు విస్తరిస్తున్నాయి. ఆ ప్రాంతంలోని స్థానికులు పోలీస్ స్టేషన్‌కు సమాచారాన్ని చేరవేశారు. ఈ మేరకు స్పందించిన సీఐ.. పోలీస్ బలగాలను, బ్లూ కోట్స్ సిబ్బందిని తీసుకొని వెంటనే మంటలు చెలరేగిన ప్రాంతానికి చేరుకుని, స్థానికుల సహకారంతో మంటలను నియంత్రణలోకి తీసుకువచ్చారు. దీంతో పెద్ద అగ్ని ప్రమాదాన్ని నివారించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. చెలరేగిన మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. అగ్నిప్రమాదలకు కారణలు ఏంటి అనే స్పష్టత కోసం ప్రాథమిక దర్యాప్తు చేపట్టామని తెలిపారు. అవసరమైతే.. సంబంధిత అధికార యంత్రాంగాలతో, సమన్వయం ద్వారా మరింతగా చర్యలు తీసుకుంటామని అన్నారు. పొలాల మధ్య చెత్త, పొడి గడ్డి, ప్లాస్టిక్ వంటివి సులభంగా మండే పదార్థాలు విస్తరించకుండా చూడాలని సూచించారు. వరి కోతలు ముగిశాక పొలాలలో వదిలేసిన వరి కొయ్యలు కాల్చివేయడం నేరంగా పరిగణించబడుతుందని హెచ్చరించారు. ఏదైనా అగ్నిప్రమాదం గురించి సమాచారం ఉంటే, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు 8712685015 ద్వారా గాని లేదా అత్యవసర హెల్ప్‌లైన్ 100కి సమాచారం ఇవ్వాలని తెలిపారు.
