Telangana | పవన్ పై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Telangana | పవన్ పై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Telangana | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : జనసేనత అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.

ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్‌ను బీజేపీ నేతలు భిక్షాం దేహి అని అడిగారని, ఆయన ఆంధ్ర నాయకుడని, తెలంగాణ వ్యతిరేకి అని అన్నారు. ఆయన చెప్తే తెలంగాణ ప్రజలు ఓటు వేయరని, గతంలో తెలంగాణ గురించి పవన్ నీచంగా మాట్లాడారని, పవన్ రాజకీయాలు ఆంధ్రాలో చేసుకోవాలని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. కులం, మతం పేరిట బీజేపీ మోసం చేయాలని చూసినా తెలంగాణ ప్రజలు మోసపోరన్నారు.

Leave a Reply