BIKE| చెట్టుకు బైక్ ఢీకొని యువకుడు మృతి..

BIKE| చిట్యాల, ఆంధ్రప్రభ: నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారి పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడకు చెందిన నకిరేకంటి కౌశిక్ (20) డిగ్రీ చదువుతున్నాడు. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బైక్ పై వెళుతున్న క్రమంలో ఉదయం సుమారు 6 గంటల సమయంలో మండల పరిధిలోని గుండ్రంపల్లి గ్రామానికి రాగానే బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీ కొనడంతో కౌశిక్ కు తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై వెంకటయ్య తెలిపారు.