Rs.50 thousand | ఏసీబీ వలలో పాలకుర్తి అధికారి

Rs.50 thousand | ఏసీబీ వలలో పాలకుర్తి అధికారి

Rs.50 thousand | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తెలంగాణలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి ఉక్కుపాదం మోపింది. హనుమకొండ జిల్లాలో పాలకుర్తి ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు.

పెద్దవంగర మండలం కన్నాయిగూడెంకు చెందిన కాంట్రాక్టర్ కర్ర అశోక్ రెడ్డి నుంచి బిల్లుల విడుదల కోసం డీఈ శ్రీకాంత్ రూ.50వేల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో బాధిత కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు హనుమకొండ భవానీనగర్‌లోని శ్రీకాంత్ నివాసంలో ఇవాళ వలపన్ని ఆయనను పట్టుకున్నారు. లంచం స్వీకరిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సంబంధిత పత్రాలు, ఇతర వివరాలపై అధికారులు తనిఖీలు చేపట్టారు.

Leave a Reply