మంగిన పూడి బీచ్ లో భక్తకోటి పరవళ్లు

మంగిన పూడి బీచ్ లో భక్తకోటి పరవళ్లు

మచిలీపట్నం ప్రతినిధి, ఆంధ్రప్రభ : మొంథా తుఫాను ఫలితంగా సాగర తీరంలో గోతులు ఏర్పడిన నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని బీచ్ లను మూసివేయగా.. కృష్ణాజిల్లా మంగినపూడి బీచ్ కు భక్త జనం పోటెత్తారు. ఈ రోజు తెల్లవారుజామునే మంగినపూడి బీచ్ లో సాగర సుప్రభాత హారతితో మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) సముద్ర స్నానాలను ప్రారంభించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులతో కలిసి పవిత్ర సముద్ర స్నానం ఆచరించారు.

ఎలాంటి అపశృతులు జరగని రీతిలో కృష్ణాజిల్ల ఎస్పీ విద్యాసాగర్(SP Vidyasagar), డీఎస్పీ రాజా తగిన ఏర్పాట్లు చేశారు. బుధవారం మధ్యాహ్నం నాటికే లక్ష మంది భక్తులు సముద్ర స్నానాలు చేశారని అంచనా. జనంతో మచిలీపట్నం కిటకిటలాడిపోయింది. ఆర్డీసీ బస్పులు కిక్కిరిపోయాయి. ఎక్కడకక్కడ పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సముద్ర స్నానాల ప్రాంతాన్ని పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు.

Leave a Reply