4-guntur-blo-suspension : సార్లు.. సర్ బుర్రు Andhra Prabha Top News

4-guntur-blo-suspension : సార్లు.. సర్ బుర్రు Andhra Prabha Top News

  • జనగణనకు గైర్హాజరు
  • గుంటూరు మున్సిపల్​ కమిషనర్​ గుర్రు
  • నలుగురు బీఎల్​ వోలపై సస్పెన్షన్​ వేటు

( గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ):

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో విధులను నిర్లక్ష్యం చేసిన నలుగురు బూత్ లెవల్ ఆఫీసర్లను గుంటూరు మున్సిపల్ కమిషనర్ కె. మయూర్ అశోక్ సస్పెండ్ చేశారు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 243వ పోలింగ్ స్టేషన్‌కు చెందిన వి. రాజ్‌కుమార్, 164వ పోలింగ్ స్టేషన్‌కు చెందిన కె. నాగరాజు, గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 225వ పోలింగ్ స్టేషన్‌కు చెందిన ధరణి, 72వ పోలింగ్ స్టేషన్‌కు చెందిన బి. పవన్‌కుమార్‌లపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు.

ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా కీలకమైన ఎస్‌ఐఆర్ విధులకు గైర్హాజరైనందున ఈ చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగమైన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యంతో నిర్వహించాలని, విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అలాగే, తమ ఇళ్లకు వచ్చే బీఎల్ఓలకు ప్రజలు సరైన సమాచారం అందించి సహకరించాలని కమిషనర్ మయూర్ అశోక్ విజ్ఞప్తి చేశారు.