40 people | భారీ పేలుడు..

40 people | భారీ పేలుడు..

40 people | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: వేసవి కాలంలో బాణసంచా ఫ్యాక్టరీల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. యాజమాన్యాల నిర్లక్ష్యం, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కేరళలోని త్రిస్సూర్‌లో ఉన్న ఓ క్రాకర్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది.

 40 people |

ఈ ఘోర ప్రమాదంలో ఎన‌మిది మంది కార్మికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనం కాగా, మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి, పెద్ద ఎత్తున క్రాకర్స్ పేలుతున్న దృశ్యాలకు సంబంధించిన భయానక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరుసగా జరుగుతున్న ఈ పారిశ్రామిక ప్రమాదాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Leave a Reply