పంట వ్యర్థాల దహనం కారణంగా రోడ్డు ప్రమాదం

పంట వ్యర్థాల దహనం కారణంగా రోడ్డు ప్రమాదం

  • వైరా వద్ద కారు పల్టీ, స్వల్ప గాయాలు

వైరా, ఆంధ్రప్రభ : పంట వ్యర్థాల దహనం కారణంగా మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వైరా నుంచి మధిర వైపు వెళ్తున్న కారుపై ఇటీవల కాలిపోయిన చెట్టు కొమ్మ అకస్మాత్తుగా పడటంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయగా కారు అదుపుతప్పి పల్టీ పడింది.

ఈ ప్రమాదంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు కుటుంబానికి చెందిన ఆయన తల్లిదండ్రులు, సతీమణితో పాటు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

పంట వ్యర్థాల దహనం కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సంపూర్ణ అవగాహన కల్పించి, పంట వ్యర్థాల దహనం నియంత్రణపై చైతన్యం తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply