శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థానంలో రేకుల షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

భక్తుల సౌకర్యార్థం నూతన నిర్మాణం.. దాత విజయ్‌కు ఆలయ కమిటీ అభినందనలు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం గ్రామ సమీపంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థాన ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించనున్న నూతన రేకుల షెడ్డు నిర్మాణ పనులకు ఆలయ చైర్మన్ కంచర్ల అశ్విన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ, దేవస్థానానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ కమిటీ కృషి చేస్తోందన్నారు. ఈ నిర్మాణానికి కొత్తపేటకు చెందిన విజయ్ దాతగా ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.

శంకుస్థాపన కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు వల్లూరి శివప్రసాద్ శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు జొన్నగంటి దాసు, పంతంగి రమేష్, మన్నే మహేందర్ రెడ్డి, ఈడుదుల బాబు యాదవ్, సిద్దిపేట ఆనంద్ రెడ్డి, బెతల నర్సింహం, వెంకీర్యాల శివచారి, బాలాగోని శ్రీకాంత్ గౌడ్, దౌడి రాజేష్, చిట్టంపల్లి సబిత–యాదయ్య, ఆలయ జూనియర్ సహాయకుడు సత్తిరెడ్డి, ఆలయ సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.