బీసీ రాజ్యాధికార పార్టీ జిల్లా బీసీ సంక్షేమ సంఘం సభ్యుడిగా కురువ అనిల్
నియామక పత్రం అందజేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
వికారాబాద్, ఆంధ్రప్రభ : బీసీ రాజ్యాధికార పార్టీ వికారాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం సభ్యుడిగా కురువ అనిల్‌ను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నియామక పత్రాన్ని అందజేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు నియామక పత్రాన్ని అందించి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా కురువ అనిల్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతంతో పాటు బీసీల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో బీసీలు రాజకీయంగా మరింత బలోపేతం అవుతారని, బీసీ రాజ్యాధికార సాధన లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతుందని ఆయన అన్నారు.
