శతరంజినవార్ చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా మాచర్ల రమేష్
ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కమిటీ.. ఘనంగా ప్రమాణ స్వీకారం
టేకుమట్ల, ఆంధ్రప్రభ : మండలంలోని శతరంజినవార్ చేనేత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన మాచర్ల రమేష్‌ను డైరెక్టర్లు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ వివరాలను ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా మచ్చగిరి సారయ్య, కార్యదర్శిగా దూడం బిక్షపతి, కోశాధికారిగా మాచర్ల మౌనిక ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా వంగ శిరీష, మాచర్ల మహేందర్, పెంట రంజిత్, మాచర్ల రాజేష్, మాచర్ల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అనంతరం ఎన్నికల అధికారి ఆనంద్, ప్రిసైడింగ్ అధికారి రేవంత్ కుమార్ నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి నియామక పత్రాలను అందజేశారు.
తదనంతరం నూతన అధ్యక్షుడు, కమిటీ సభ్యులను పద్మశాలి సంఘం నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దూడం రాములు, గీతారాణి, నాగుల స్వరూప, రంజిత్, పొద్దుల రాజు, గౌతం, రజాక్ రాజు, వీణ తదితరులు పాల్గొన్నారు.
