స్వదేశానికి వచ్చిన కౌన్సిలర్ దంపతులకు ఆత్మీయ సన్మానం

అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన అనురాధ–శ్రీనివాస్ రెడ్డి దంపతులకు ఘన స్వాగతం

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురానికి చెందిన 5వ వార్డు కౌన్సిలర్ మొగుళ్ల అనురాధ, శ్రీనివాస్ రెడ్డి దంపతులు ఇటీవల అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి రాగా, ఆదివారం వారికి ఆత్మీయ సన్మానం నిర్వహించారు.

మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్నతో పాటు పలువురు వార్డు కౌన్సిలర్లు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో మరింత చురుకుగా కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కారుపోతుల వెంకన్న, నల్ల మధు, కూర్మిళ్ల ప్రమీల రాములు, మెంట రమణ, నగేష్ తదితరులు పాల్గొన్నారు.