మండలంలో ఘనంగా బక్రీద్ వేడుకలు..

మండలంలో ఘనంగా బక్రీద్ వేడుకలు..
శావల్యాపురం, ఆంధ్రప్రభ: త్యాగం, సహనం, ఐకమత్యానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పర్వదిన వేడుకలను మండల కేంద్రమైన శావల్యాపురం, వేల్పూరు, శానంపూడి, కారుమంచి తదితర గ్రామాల్లో ముస్లిం సోదరులు గురువారం ఘనంగా నిర్వహించారు.
ప్రజల మధ్య శాంతి, సామరస్యాన్ని, సోదరభావాన్ని పెంపొందించే ఈ పండుగను భక్తి పరవశంతో జరుపుకున్నారు.
మండలంలోని కారుమంచి స్టేట్ బ్యాంక్ సమీపంలోని ఈద్గా వద్ద హఫీజ్ మహమ్మద్ ఇనాం ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు సామూహిక ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ధార్మిక ఉపన్యాసం చేశారు.
దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకుంటున్నట్లు తెలిపారు. ధనిక, పేద తారతమ్యం లేకుండా పరస్పరం ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
