ఓటును దుర్వినియోగం చేయవద్దు…

ఓటును దుర్వినియోగం చేయవద్దు…

అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అర్ల రమేష్

కడెం, ఆంధ్రప్రభ : ప్రజలు, యువకులు, మహిళలు ఓటు హక్కును దుర్వినియోగం చేయవద్దని అంబేద్కర్ సంఘం నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ల రమేష్ అన్నారు. ఈనెల 1 నుండి 14 వరకు గ్రామాలలో జై బీమ్ జ్ఞానయాత్ర నిర్వహిస్తూ గ్రామ గ్రామాన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈనెల 14న అంబేద్కర్ జయంతి ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించాలని అంబేద్కర్ సంఘం నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు అర్ల రమేష్ పిలుపునిచ్చారు.

కడెం దస్తురాబాద్ మండలాల్లోని కొత్తమద్దిపడగ, లింగాపూర్, నచ్చన్, ఎల్లాపూర్, బుట్టాపూర్, బూత్కూరు, దేవునిగూడెం, తదితర గ్రామాల్లో ఆయన జై భీమ్ జ్ఞాన యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ కలిపించిన ఓటు హక్కును బహుజనులు, దుర్వినియోగం చేసుకోవద్దని, ఓటును అమ్ముకోవద్దని ఇలా చేయడం వలన అంబేద్కర్ కలిపించిన ఓటు హక్కు విలువలువలు కోల్పోతున్నామన్నారు. మనకు ప్రజాసేవ చేసే మంచి నాయకునికి ఓటు వేసుకోవాలన్నారు. మంచి నాయకునికి ఓటు వేస్తే భవిష్యత్తులో గ్రామ అభివృద్ధి, ప్రజల కొరకు నిరంతరం ప‌ని చేస్తాడన్నారు.

అవినీతికి పాలు పడకుండా పరిపాలన కొనసాగిస్తాడని అలాంటి వ్యక్తి కి ఓటు వేయాలని అంబేద్కర్ ఆశయం అన్నారు. ఈ కార్యక్రమంలో నేత కుల సంగం రాష్ట్ర నాయకులు దూల్లే వెంకటేష్, జిల్లా నాయకులు అంకంపేట గంగాధర్, డీఎస్పీ కడెం మండల అధ్యక్షుడు, దుర్గం భీమన్న, మద్దిపడగ ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ కొండ శంకర్, పెరిక కుల సంఘం నాయకులు లింగాల శంకర్, నాయకులు మార్కరి జగదీశ్వర్, కమ్మరి రాజశేఖర్, అరిపెల్లి లచ్చన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.