Jainoor | నూతన సర్పంచ్ కు సన్మానం

Jainoor | నూతన సర్పంచ్ కు సన్మానం

Jainoor | జైనూర్, ఆంధ్రప్రభ : జైనూర్ మండలంలోని ఉషగాం సర్పంచ్ ఆత్రం నిర్మలబాయి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇవాళ‌ నిర్వహించిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పాల్గొని, నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డుసభ్యులను అభినందించారు. శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

గ్రామాభివృద్ధి దిశగా ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు ఐక్యతతో గ్రామ ప్రగతికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జైనూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముకింద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్రం శశిపాల్, కోటేష్, హైమద్ దండుగుల మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply