నూతన డీఎంహెచ్‌వో సాధన మనోహర్‌కు ఘన సన్మానం

నూతన డీఎంహెచ్‌వో సాధన మనోహర్‌కు ఘన సన్మానం

గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్ష

ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా నూతన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి (డీఎంహెచ్‌వో)గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ సాధన మనోహర్‌ను ఆదివారం టీఎస్‌పీఆర్‌టీయూ రాష్ట్ర నాయకులు, మండల విద్యాశాఖ అధికారి ఆడే ప్రకాష్, ఉపాధ్యాయ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్ సాధన మనోహర్‌ను శాలువాతో సన్మానించి అభినందించారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి ఆడే ప్రకాష్ మాట్లాడుతూ, ఆదిలాబాద్ జిల్లాకు గిరిజన మహిళ జిల్లా వైద్యాధికారిగా నియమితులు కావడం సంతోషకరమైన విషయమన్నారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరుస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సీఆర్పీల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాథోడ్ శ్రీనివాస్‌తో పాటు ఉపాధ్యాయ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply