సోలార్ ప్లాంట్ కు స్థల పరిశీలన…
సోలార్ ప్లాంట్ కు స్థల పరిశీలన…
బిక్కనూర్, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర రెడ్ కో సంస్థ ప్రతినిధులు (Representatives) స్థలాన్ని పరిశీలించారు. గ్రామాన్ని మెడల్ సోలార్ గ్రామంలో ఎంపిక చేశారు. ఇందులో భాగంగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం గ్రామ శివారులో గల అన్ని ప్రభుత్వ భూములను వారు పరిశీలించారు.
సోలార్ (solar) విద్యుత్ కోసం అనుకూలంగా ఉన్న స్థలాన్ని ఎంపిక చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వారు విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. వారి వెంట విద్యుత్ శాఖ ఏఈ సంకీర్త్ గ్రామ సచివాలయ కార్యనిర్వాన అధికారి మహేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.
