Tragedy incident | దంపతుల దుర్మరణం…
Tragedy incident | దంపతుల దుర్మరణం…
ఉట్పల్లిలో విషాదం.. కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు
Tragedy incident |బోధన్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఉట్పల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఉతికిన దుస్తులు ఆరవేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులను జ్యోతి, సంజీవ్ దంపతులుగా గుర్తించారు. ఇంటి వద్ద ఉతికిన బట్టలను ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రవాహానికి గురై ఇద్దరూ కుప్పకూలిపోయారు. స్థానికులు గమనించి వెంటనే సహాయక చర్యలు చేపట్టినా అప్పటికే వారు మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దంపతుల మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
